నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ను ప్రారంభం..

నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ను ప్రారంభం..

కంకిపాడు – ఆంధ్రప్రభ : కంకిపాడులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని సోమవారం రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత ప్రారంభించారు. ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ ముఖ్య భూమిక పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, ఏలూరు రేంజ్ డిఐజి అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, పెనమలూరు శాసనసభ్యులు బోడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.