కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి సవిత

కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి సవిత

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమం, చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్. సవిత శనివారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని దర్శించుకున్నారు. కుమారుడితో కలిసి ఆలయానికి విచ్చేసిన మంత్రి సవిత, శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం దేవస్థాన అధికారులు మంత్రి కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు.

అనంతరం దర్శన ఏర్పాట్లు చేసి, అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య మంత్రి కుటుంబ సభ్యులకు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా దేవస్థానం డిప్యూటీ ఈఓ కిశోర్ కుమార్ మంత్రికి అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి చిత్రపటాన్ని జ్ఞాపికగా బహుకరించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

Leave a Reply