అహ్మదాబాద్: ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నేడు నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో… లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో చెలరేగింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలను అల్లాడిస్తూ.. లక్నో బ్యాటర్లు దంచేశారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో… ప్రతి ఓవర్‌కూ దుమ్మురేపుతూ నిర్ణీత ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికే 235 పరుగులు భారీ స్కోర్‌ను నమోదు చేసింది.
ఓపెనర్లు ఐడెన్ మార్కరమ్ – మిచెల్ మార్ష్ కలిసి లక్నోకు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 59 బంతుల్లో 91 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. మార్కరమ్ 24 బంతుల్లో 36 పరుగులు చేసి ఔటవ్వగా, మిచెల్ మార్ష్ మాత్రం గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
మిచెల్ మార్ష్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో కేవలం 56 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసి.. 64 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సులతో 117 పరుగులతో మెరిశాడు. మార్ష్ ఆట తీరుతో లక్నో స్కోరు బోర్డును పరుగులుపెట్టింది.
వన్ డౌన్ లో వచ్చిన నికోలస్ పూరన్ కూడా మార్ష్ కు విధ్వంసానికి తోడ్పడ్డాడు. కేవలం 23 బంతుల్లోనే తన అర్ధ సెంచరీ పూర్తి చేసిన పూరన్.. 27 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు సాధించి నాటౌట్ గా ఇన్నింగ్స్ ను ముగించాడు. మార్ష్ – పూరన్ కలిసి రెండో వికెట్‌కు 52 బంతుల్లో 121 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
ఇన్నింగ్స్ చివర్లో కెప్టెన్ రిషబ్ పంత్ కూడా రెండు సిక్సర్‌తో ఆకట్టుకున్నాడు. 6 బంతులు ఎదుర్కున్న పంత్ 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో గుజరాత్ గుజరాత్ తరఫున అర్షద్ ఖాన్, సాయి కిషోర్ ఒక్కో వికెట్ తీసి కొంత ఊరట కలిగించారు. ఇక దీంతో 236 పరుగులు విజయలక్ష్యంతో గిల్ సేన ఛేజింగ్ కు దిగనుంది.