ధనాల వెంకటరత్నారావును పరామర్శించిన కొడాలి నాని

త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించిన మాజీ మంత్రి

కృష్ణా, ఆంధ్రప్రభ: జాతీయ రెల్లి కులాల సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి ధనాల వెంకటరత్నారావును మాజీ మంత్రి కొడాలి నాని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.

కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ధనాల వెంకటరత్నారావు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందారు. వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం పరిస్థితిని బట్టి ఎడమ కిడ్నీని శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.

వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అనంతరం ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కొడాలి నాని కుటుంబ సభ్యులను కలిసి వెంకటరత్నారావు ఆరోగ్య పరిస్థితి, చికిత్సకు తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన కొడాలి నాని అధైర్యపడవద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రజాసేవలో చురుకుగా ఉంటూ సంఘం బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ధనాల వెంకటరత్నారావు త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో కొంకితల ఆంజనేయ ప్రసాద్, వేంపల అప్పారావు, పల్లంట్ల సత్యనారాయణ, తోట సాయి, ఆత్మూరి మల్లేశ్వరరావు, రాలీ సాయి, రాలీ పార్వతి, పిట్టల లక్ష్మి, ఆచంట గంగాధరరావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.