ఆలేరులో రైతు సేవా కేంద్రం ప్రారంభం
ఆలేరు (ఆంధ్రప్రభ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలో రైతు సేవా కేంద్రాన్ని బహదూర్పేట బిల్ కలెక్టర్ దొంతుల ఎల్లయ్య గురువారం ప్రారంభించారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పంటల సంరక్షణ మందులు ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటాయని నిర్వాహకుడు దొంతుల రాజు తెలిపారు.
రైతులు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను ఒకేచోట పొందేలా సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, స్థానికులు పాల్గొన్నారు.
