మహానాడు ఏర్పాట్లు పూర్తి.. కార్యకర్తలకు కీలక పిలుపు

కోడూరు, ఆంధ్రప్రభ ; ఈనెల 27, 28 తేదీలలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించబోయే మహానాడు పండుగను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జయప్రదం చేయాలని టిడిపి అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు కోరారు.
బుధవారం కోడూరు మండల పరిధిలోని 2 క్లస్టర్లలో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయనున్న కోడూరు టీడీపీ పార్టీ కార్యాలయం , విశ్వనాధపల్లి గ్రామాలలో పర్యటించి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
ప్రస్తుత ఇంధన కొరత దృష్ట్యా, అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దేశంలోనే ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా హైబ్రిడ్ విధానంలో ఈ మహానాడును నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మండలంలో 2 క్లస్టర్లలో ఏర్పాటు చేసిన స్క్రీన్ల ద్వారా మహానాడు ప్రత్యక్షంగా ప్రసారం చేయబడుతుందని మండల టీడీపీ అధ్యక్షులు బండే శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు
స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు.
