కోదాడలో విధుల్లో చేరిన ఏఎంవీఐ పి. శ్రావంతి

కోదాడ, ఆంధ్రప్రభ: అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) పి. శ్రావంతి కోదాడ యూనిట్ కార్యాలయంలో శుక్రవారం విధుల్లో చేరారు. పోలీస్ అకాడమీలో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అనంతరం ఆమె మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ షేక్ జిలానీకి రిపోర్ట్ చేసి బాధ్యతలు స్వీకరించారు.

పోలీస్ అకాడమీలో నిర్వహించిన శిక్షణలో మోటార్ వాహన చట్టాల అమలు, రహదారి భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు ప్రమాదాల దర్యాప్తు, ప్రజాసేవ తదితర అంశాల్లో ఆమె సమగ్ర శిక్షణ పొందారు. శిక్షణ పూర్తిచేసుకుని శాఖలో సేవా ప్రస్థానాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ షేక్ జిలానీతో పాటు కోదాడ యూనిట్ కార్యాలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. పి. శ్రావంతి నియామకంతో మోటార్ వాహన చట్టాల అమలు, రహదారి భద్రతపై అవగాహన, ప్రజలకు వేగవంతమైన సేవల అందింపులో మరింత మెరుగైన ఫలితాలు సాధించగలమని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.