గుజ్జ అశోక్‌కు ఉగాది పురస్కారం…

గుజ్జ అశోక్‌కు ఉగాది పురస్కారం…

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన పద్మశాలి సంఘం నాయకులు గుజ్జ అశోక్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ( టిఆర్ పి ఎస్ ) 2026 రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు.

పద్మశాలి టెక్స్టైల్స్ లైఫ్ స్టైల్, వి ఎం ఎన్, టి ఆర్ పిఎస్, జాతీయ చేనేత ఐక్యవేదిక సంస్థలు సంయుక్తంగా, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సేవా రంగంలో నిరంతర కృషికి గాను హైదరాబాద్ ఎల్బీనగర్ కేబీఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో అశోక్ కు ఈ అవార్డును ప్రముఖ సినీ నటులు బాబు మోహన్ చేతుల మీదుగా అందజేశారు. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకాటి రాజ్ కుమార్, పద్మశాలి ప్రముఖులు జాతీయ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అశోక్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply