ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికుల అవస్థలు

పరకాల, ఆంధ్రప్రభ: పరకాల ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం సమయంలో బస్టాండ్‌లో భారీగా ప్రయాణికులు చేరుకున్నప్పటికీ ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బస్సుల కోసం ఎదురుచూసిన ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అత్యవసర పనులపై వెళ్లాల్సిన వారు చివరకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి అధిక ఛార్జీలు చెల్లిస్తూ, కిక్కిరిసిన పరిస్థితుల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సి వచ్చింది.

పరకాల బస్టాండ్‌లో తరచూ బస్సుల కొరత కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి అవసరమైన సమయంలో తగిన సంఖ్యలో బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.