శుభ సందర్భాల్లో మొక్కలు నాటాలి

శుభ సందర్భాల్లో మొక్కలు నాటాలి

  • ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ నారీ సెల్ కోఆర్డినేటర్ శ్రీలత

నేరేడుచర్ల, ఆంధ్రప్రభ:
ప్రతి శుభ సందర్భంలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్ నారీ సెల్ కోఆర్డినేటర్ వీరవెల్లి శ్రీలత కోరారు.

బుధవారం ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ట్రైనర్ కొత్త లక్ష్మణ్ మనవరాలు శార్వి ప్రథమ మాసం పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీలత మాట్లాడారు.

పెళ్లిరోజులు, పుట్టినరోజులు వంటి శుభ సందర్భాల్లో కేకులు కట్ చేయకుండా మొక్కలు నాటి వాటిని జ్ఞాపికలుగా పెంచాలని, తద్వారా భావితరాలకు కాలుష్యరహిత సమాజాన్ని అందించవచ్చని ఆమె సూచించారు.

మొదటి నెలలో ఒక మొక్క, రెండవ నెలలో రెండు మొక్కలు, మూడవ నెలలో మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఇంపాక్ట్ ట్రైనర్ క్లబ్ సెక్రటరీ పోలిశెట్టి శ్రీధర్, పోలిశెట్టి వెంకటేశ్వర్లు, దేవరశెట్టి చిన్న వెంకటేశ్వర్లు, కుంకు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply