ఈనెల12న జంగమ సమాజం సమావేశం..
బిక్కనూర్, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా జంగమ సమాజ సమావేశం ఈనెల 12న నిర్వహిస్తున్నట్లు జంగమ సమాజం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణం స్వామీజీ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ బిక్కనూర్ మండల కేంద్రంలోని సిద్ధిరామేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇట్టి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సమావేశానికి జిల్లాలో గల జంగమ సమాజం ప్రతినిధులు సభ్యులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు.
సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతున్నట్లు తెలిపారు. జంగమ సమాజం సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో చర్చించడం జరుగుతుందన్నారు. సమావే శం అనంతరం భోజన వసతి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇట్టి సమావేశాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని సూచించారు.
