రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా…
రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా…
ప్రారంభించిన మంత్రి పొంగులేటి
హనుమకొండ, ఆంధ్రప్రభ : హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, దనసరి అనసూయ సితక్కలు కలిసి మేళాను ప్రారంభించారు. మంత్రులు వివిధ వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, సాంకేతిక స్టాళ్లను సందర్శించి రైతులతో మమేకమయ్యారు.
ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు కొత్త సాంకేతికతను అవలంబించి దిగుబడులు, ఆదాయాలు పెంచుకోవాలని మంత్రులు సూచించారు. కార్యక్రమంలో డా. కడియం కావ్య (ఎంపీ), వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
