రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం..
పిర్మయికుంట తండాలో అభివృద్ధి ప్రారంభం
తాడ్వాయి, ఆంధ్రప్రభ : తాడ్వాయి మండలంలోని పిర్మయికుంట తండాలో రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను శనివారం ప్రారంభించినట్లు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు షౌకత్ తెలిపారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొని పనులకు శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో సీసీ రోడ్లు నిర్మించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ నిధులు మంజూరు చేస్తున్నారని షౌకత్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాదవ్ రేణుక, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గైని రాజలింగం, గ్రామ అధ్యక్షుడు శ్రీను, పాలకవర్గ సభ్యులు పండరి రాథోడ్, రజిత, సంతోష్, రామ్‌దాస్, రాములు, జగ్వర్, అశోక్, పీఏసీఎస్ డైరెక్టర్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
