జగదీశ్ రెడ్డి జన్మదినం సందర్భంగా అన్నదానం, హెల్మెట్ల పంపిణీ
మోత్కూర్, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు డాక్టర్ కోక బిక్షం శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
నల్లగొండ జిల్లాలోని చెరువుగట్టు దేవస్థానం ఆవరణలో సుమారు 100 మంది నిరుపేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కోక బిక్షం మాట్లాడుతూ, జగదీశ్ రెడ్డి హయాంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని కొనియాడారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.
అదే సందర్భంగా జగదీశ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మండలంలోని దాచారం మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కడమంచి వస్తాద్ కుమారుడు రాజు ఆర్థిక సహకారంతో 10 హెల్మెట్లను స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట సీఐ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా వాహనదారులకు ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
కార్యక్రమంలో ఏఎస్‌ఐ వెంకన్న, హెడ్ కానిస్టేబుల్ నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
