20 న కవిత నిరహార దీక్ష..

  • సింగరేణిలో మెడికల్ బోర్డు సాధన కోసం

గోదావరిఖని, ఆంధ్రప్రభ : సింగరేణి కార్మికుల మెడికల్ బోర్డు ఏర్పాటు డిమాండ్‌తో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఈ నెల 20న పెద్దపల్లి జిల్లా రామగుండంలో దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్నానని తెలిపారు. మెడికల్ బోర్డు ఏర్పాటు జరిగే వరకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.