Karimnagar | మూడు పాడి ఆవుల చోరీ

Karimnagar | మూడు పాడి ఆవుల చోరీ

  • చోరీకి గురైన ఆవుల విలువ రూ.2.7 ల‌క్ష‌లు

Karimnagar | గన్నేరువరం, ఆంధ్రప్రభ : మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి(Saturday midnight) గ్రామానికి చెందిన సుధగోని మహేందర్, న్యాలపట్ల ఎల్లయ్య గౌడ్, బండి కనకయ్య లకు చెందిన మూడు పాడి ఆవులు చోరీకి గుర‌య్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు తాళ్లు కోసి బొలెరో వాహనం(Bolero vehicle)లో ఎక్కించుకొని వెళ్లిపోయార‌ని బాధితులు భావిస్తున్నారు.

ఒక్కో ఆవు సుమారు 90 వేల రూపాయల(90 thousand rupees) ఖరీదు చేస్తుందని తెలిపారు. ఆవులు దొంగతనం కావడంతో ఉపాధి కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వెంటనే చ‌ర్య‌లు తీసుకో్వాల‌ని వారు కోరారు.

Leave a Reply