TG | తండ్రి ఆ బాధతో…

TG | తండ్రి ఆ బాధతో…
TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కూతురి పెళ్లి కోసం బిడ్డల్లా పెంచుకున్న మేకలను అమ్ముకున్న ఓ తండ్రి, ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నందిగామ గ్రామంలో చోటుచేసుకుంది. బిడ్డ పెళ్లి చేసిన కొన్ని గంటలకే తండ్రి బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
గ్రామానికి చెందిన దేవన్నకు వందకు పైగా మేకలు ఉండేవి. వాటిని తన కుటుంబ సభ్యుల్లా, బిడ్డల్లా చూసుకునేవాడు. కూతురు పెళ్లి ఖర్చుల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో 30 మేకలను విక్రయించాల్సి వచ్చింది.
పెళ్లి కార్యక్రమం పూర్తయ్యాక ఇంటికి తిరిగి వచ్చిన దేవన్న, ఇంటి ఆవరణలో మేకల సంఖ్య తగ్గిపోవడం చూసి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బిడ్డల్లా పెంచుకున్న మేకలు కనిపించకపోవడం ఆయనను తీవ్రంగా కలిచివేసింది.
ఆవేదనను తట్టుకోలేక దేవన్న ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన గ్రామంలో విషాద ఛాయలు అలుముకుంది.
