MLA | ముందస్తు వైద్యపరీక్షలు ఆరోగ్యానికి మేలు
MLA | ముందస్తు వైద్యపరీక్షలు ఆరోగ్యానికి మేలు
- విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు
Ameerpet | అమీర్పేట, ఆంధ్రప్రభ : ముందస్తుగా వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ఆరోగ్య పరంగా రాబోయే ప్రమాదాలను అధిగమించే అవకాశం ఉంటుందని మాజీమంత్రి, బీఆర్ఎస్ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Thalasani Srinivas Yadav) అన్నారు. ఈ రోజు అమీర్ పేట డివిజన్ శివబాగ్ కాలనీలో లయన్స్ క్లబ్(Lions Club) ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకుని వైద్య పరీక్షలు తప్పనిసరిగా జరిపించుకోవాలని కోరారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఆయన వివరిస్తూ ప్రశంసించారు. పేద ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ఉచిత వైద్య శిబిరాలు(Free Medical Camps) ఏర్పాటు చేయాలని లయన్స్ క్లబ్ సభ్యులను కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషు కుమారి(Namana Seshu Kumari), లయన్స్ క్లబ్ గవర్నర్ అమర్నాధ్, బిఆర్ఎస్ నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, కర్నాకర్ రెడ్డి, పీయూష్ గుప్తా, రామ్ నివాస్ బన్సాల్, గుడిగే శ్రీనివాస్ యాదవ్, జితేందర్ శుక్లా, గౌతమ్, మధు, నిర్వాహకులు ప్రదీప్ అగర్వాల్, మహేందర్ గుప్తా తదితరులు ఉన్నారు.

