అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా..

అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా..
- 8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కడారి పద్మ
కల్వకుర్తి: ఫిబ్రవరి 6 (ఆంధ్రప్రభ): మున్సిపాలిటీ ఎన్నికల్లో తనను కౌన్సిలర్ గా గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కడారి పద్మ తిరుపతయ్య యాదవ్ ఓటర్లను కోరారు. ఎన్నికల్లో భాగంగా ప్రతిరోజు వార్డులో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తూ చెయ్యి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
అభివృద్దే ధ్యేయంగా ప్రజాసేవే లక్ష్యంగా మీ ముందుకు వస్తున్న తనను మీ బిడ్డగా ఆశీర్వదించాలని ఆమె ఓటర్లను కోరుతున్నారు. కౌన్సిలర్ గా గెలిపిస్తే ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో వార్డును అన్ని రంగాలలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇస్తూ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో చెయ్యి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కడారి పద్మ తిరుపతయ్య యాదవ్ ఓటర్లను కోరారు.
