బీజేపీ నేత సుధాకర్ రావును గృహ నిర్బంధం చేసిన పోలీసులు
బీజేపీ నేత సుధాకర్ రావును గృహ నిర్బంధం చేసిన పోలీసులు
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టులను చూడడానికి వస్తున్న నేపథ్యంలో కొల్లాపూర్ నియోజక వర్గ బీజేపీ నేత మాజీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రిని నిలదీస్తామని సుధాకర్ రావు ప్రకటన చేసిన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు కార్యకర్తలు ఇంట్లో ఉండగానే గేటుకు తాళం వేసి రాకపోకలను నిలిపివేసినట్లు సమాచారం ఆయన ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు ఈ విషయాన్ని బీజేపీ పార్టీ వర్గాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సంచలనంగా మారింది
