Kaddam | యువత క్రీడల్లో రాణించాలి..

Kaddam | యువత క్రీడల్లో రాణించాలి..

Kaddam (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : యువత క్రీడాల్లో రాణించాలని ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పడిగల భూషణ్ అన్నారు. కడెం మండలంలోని పెద్ద బెల్లాల్ జిపి పరిధిలో గల మోర్రిగూడెం గ్రామంలో రైసింగ్ స్టార్స్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ను ఏఎంసీ చైర్మన్ భూషణ్ గురువారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని యువత క్రీడాల్లో రాణించి తమ క్రీడా నైపుణ్యాన్ని చాటి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద బెల్లాల్ గ్రామ సర్పంచ్ ఈదుల తిరుపతి, చిన్న బెల్లాల్ సర్పంచ్ బొంతల లక్ష్మీ భూమన్న, ఉప సర్పంచ్ లు తక్కల్ల రమ్య రవీందర్, అల్తపు అనూష శ్రీనివాస్, బీసీ యువ సంఘం రాష్ట్ర నాయకులు సౌధాని, వెంకటరమణ యాదవ్, బీఆర్ఎస్ యూత్ జిల్లా నాయకులు అంతర్పుల సన్నీ, నాయకులు అభిలాష్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.