Geddam Vivek | 13 కోట్ల నిధులతో పట్టణ అభివృద్ధి..

Geddam Vivek | 13 కోట్ల నిధులతో పట్టణ అభివృద్ధి..

Geddam Vivek, చెన్నూర్ ఆంధ్రప్రభ : చెన్నూరు మున్సిపాల్టీ పరిధిలోని వార్డుల్లో 13కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం మంత్రి వివేక్ వెంకటస్వామి పట్టణలోని పలు వార్డుల్లో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజి నిర్మాణా పనులకు స్థానిక నాయకులతో కలిసి శంఖు స్థాపన చేశారు.

కొత్త గూడెం, లక్ష్మి దేవరవాడ, శిశుమందిర్ కాలనీ, ఎమ్మెల్యే కాలనీ, తదితర నిర్మాణా పనులను ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని గ్రామ, పట్టణ కేంద్రాల మౌలిక సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గ కేంద్రమైన చెన్నూరు మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పాడనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చెన్న సూర్యనారాయణ, చింతల శ్రీనివాస్, బషీరొద్దీన్, కరీం, మాజీ సర్పంచ్ సాధనబోయిన క్రిష్ణ, మాజీ కౌన్సిలర్ తుమ్మ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply