Video | హాట్ టాపిక్‌గా చిరు వీడియో!

Video | హాట్ టాపిక్‌గా చిరు వీడియో!

Video | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే మెగాస్టార్ చిరంజీవి, నేడు మరో ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతూ.. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను ఆయన విడుదల చేశారు. అందులో ఆయన ఒక యువకుడిలా తీవ్రంగా శ్రమిస్తూ కసరత్తులు చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వయసులో కూడా సినిమా కోసం చిరంజీవి పడుతున్న తపన ఈ వీడియో ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది.

ఈ వీడియోతో పాటు సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించిన వివరాలను కూడా ఆయన వెల్లడించారు. బాబీ దర్శకత్వంలో తాను నటించబోయే సినిమా పూజా కార్యక్రమాన్ని ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్నట్లు చిరంజీవి ప్రకటించారు. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది.

Leave a Reply