కేసీఆర్, హరీష్ రావులపై న్యాయం గెలిచింది ..

కేసీఆర్, హరీష్ రావులపై న్యాయం గెలిచింది ..

తెలంగాణ హైకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన మాజీ కౌన్సిలర్ అమరం జైపాల్ రెడ్డి

మేడ్చల్, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ జాతిపిత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుల విషయంలో తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పు చారిత్రాత్మకమని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ అమరం జైపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ తీర్పు ప్రజాస్వామ్య విజయమని కొనియాడారు. ​కమిషన్ తీరుపై విమర్శ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే పనిచేసిందని ఆయన ఆరోపించారు.

రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కమిషన్ నిర్ణయాలు ఉన్నాయని, ఇప్పుడు హైకోర్టు ఆ నిర్ణయాలను కొట్టివేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గట్టి “చంపపెట్టు” అని పేర్కొన్నారు. న్యాయం గెలిచిందని, అధర్మం ఓడిపోయిందని చెబుతూ.. ఇకనైనా తెలంగాణ జాతిపితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని ప్రత్యర్థులను హెచ్చరించారు. ​”తెలంగాణను సాధించిన నాయకుడిపై బురదజల్లే ప్రయత్నాలు ఫలించవు. హైకోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి అని తెలిపారు.. ​ ఈ తీర్పుతో బిఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొందని, నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply