ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి
ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి
సిర్పూర్ (యు ) ఆంధ్రప్రభ : రైతులు పకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని కొమురం భీ0 ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు )మండలంలోని పంగిడి గ్రామపంచాయతీ రైతు వేదికలో రైతులకు పకృతి వ్యవసాయంపై నేషనల్ మిషన్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమంలో భాగంగా రైతులకుఅవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆత్రం మీరా జాలింషా మాట్లాడుతూ రైతులు పంటల మార్పిడితోపాటు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని వ్యవసాయ అధికారుల సలహ సూచనలు పాటించాలని కోరారు.
ఈ సందర్భంగా రైతులకు కిట్లు పంపిణీ చేసి పకృతి వ్యవసాయం సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ అవగాహన సమావేశంలో సిర్పూర్ మండల వ్యవసాయ అధికారి ఆనంద్ రావు, పంగిడి ఏఈఓ మధుకర్, రైతు సంఘాల నాయకులు శ్యామ్ రావు, వెంకట్రావు, సుందర్,లక్ష్మీబాయి,రైతులు పాల్గొన్నారు.
