Kudavelli jathara | పోలీసుల ఓవరాక్షన్..

Kudavelli jathara | పోలీసుల ఓవరాక్షన్..

Kudavelli jathara, నిజాంపేట, ఆంధ్రప్రభ : మౌని అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని భూంపల్లి మండలం రామేశ్వరం పల్లి గ్రామ పరిధిలోని ప్రసిద్ధిగాంచిన కూడవెల్లి పుణ్యక్షేత్రంలో కొలువుదీరిన రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు భక్తుల తాకిడికి సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు. దేవాలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్ ఏర్పాటు చేయగా పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించడం, వారికి తెలిసిన వారిని క్యూ లైన్ లేకుండా దర్శనానికి పంపించడం జరిగింది. ఇది ఏమిటని..? పత్రికా విలేఖరి ప్రశ్నించగా అతని పై దురుసుగా మాట్లాడడమే కాకుండా బయటకు నెట్టి వేయడం జరిగింది.

సమాజంలో ప్రజల సమస్యల పై నిరంతరం పోరాడే జర్నలిస్టులకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్న కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసు పేరిట ప్రజలతో స్నేహపూరితంగా మెలగాలని సూచిస్తే.. కొందరు పోలీసులు వారికి నచ్చినట్టుగా వ్యవహరించడం పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శనానికి వచ్చిన వారి పై దురుసుగా వ్యవహరించిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.

Leave a Reply