July 21 | 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో…

July 21 | 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో…

July 21 | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్‌ : భారత ఎన్నికల సంఘం మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

ఏపీలో జులై 21 నుంచి ప్రక్రియ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో జులై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటన ప్రక్రియ కొనసాగనుంది. అనంతరం సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

తెలంగాణలో అక్టోబర్ 1న తుది జాబితా

తెలంగాణలో జులై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు ముసాయిదా ఓటరు జాబితా ప్రకటన ప్రక్రియ నిర్వహించనున్నారు. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఓటర్లు తమ వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.