మంత్రి కొల్లు రవీంద్ర సమక్షంలో టీడీపీలోకి చేరిక

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం తాళ్లపాలెం పంచాయతీ రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తాళ్లపాలెం పంచాయతీ నాయకుడు శ్రీకాకుళం నాగేశ్వరరావు (బాబు)రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులయ్యే తాము పార్టీలో చేరుతున్నట్లు నాగేశ్వరరావు బాబు పేర్కొన్నారు.
