బీచ్ వద్ద టాయిలెట్స్ నిర్మాణానికి శంకుస్థాపన
బీచ్ వద్ద టాయిలెట్స్ నిర్మాణానికి శంకుస్థాపన
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మచిలీపట్నం నియోజకవర్గంలోని మంగినపూడి బీచ్‌ను పర్యాటక రంగంగా మరింత అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాల కల్పన దిశగా టాయిలెట్స్ నిర్మాణానికి నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మచిలీపట్నం మంగినపూడి బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేసామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సినిమా షూటింగులు సైతం ఇక్కడ నిర్వహించే విధంగా స్టూడియోలు ఏర్పాటుకు వంద ఎకరాలు స్థలాలు కేటాయిస్తామని, రాష్ట్రంలోనే నెంబర్ వన్ బీచ్ గా మచిలీపట్నం బీచ్ ని అభివృద్ధి చేస్తామన్నారు.
ఇంతకుముందు నిర్వహించిన బస్సుల బీచ్ ఫెస్టివల్స్ లక్షలాది మందిని ఆకట్టుకుంది 2014 నుంచి 19 వరకు మచిలీపట్నం బీచ్ ఎంతగానో అభివృద్ధి చెందింది ఆ తర్వాత ఐదేళ్లపాటు వైసీపీ హయాంలో ఆగం మీకు పరిస్థితి తయారయింది. మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు రెండేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి దానిలో భాగంగానే మచిలీపట్నం బీచ్ లో టాయిలెట్స్ కాఫీ షాపు వగైరా అభివృద్ధి పనులకు ఈరోజు శంకుస్థాపన చేశామన్నారు.
