College | మారిస్ స్టెల్లా కళాశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం

College | మారిస్ స్టెల్లా కళాశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం

  • ఎన్‌ఎస్‌ఎస్ విభాగాల ఆధ్వర్యంలో 200మందికి కంటి పరీక్షలు

College | (పటమట, ఆంధ్రప్రభ) : విజయవాడలోని మారిస్ స్టెల్లా కళాశాలలో కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విభాగాల ఆధ్వర్యంలో ఇవాళ‌ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ‌ని పేర్కొంటూ, కళ్ల పరిరక్షణ అత్యంత ప్రాముఖ్యమైనదని, కంటి సంబంధిత వ్యాధులు ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు.

ముఖ్య అతిథిగా కంటి వైద్య నిపుణులు డాక్టర్ బషీర్ అహ్మద్ హాజరయ్యారు. కంటి వైద్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని, మెరుగైన వైద్య సేవలు తమ ఆసుపత్రిలో అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ విభాగ ఉప ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ ఆశ, ఇంటర్ విభాగ ఉప ప్రిన్సిపాల్ స్వప్న పాల్గొన్నారు. అలాగే ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాధికారులు డాక్టర్ శ్రీనివాసరావు, హారిక, ఎన్‌ఎస్‌ఎస్ స్వచ్ఛంద సేవకులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది కలిపి మొత్తం 200 మంది ఈ శిబిరంలో పాల్గొన్నారు.

Leave a Reply