Janvi kapoor | వ్యూహం ఫలించేనా..?

Janvi kapoor | వ్యూహం ఫలించేనా..?
Janvi kapoor | సౌత్ ఎంట్రీకి జాన్వీ కొత్త వ్యూహం
శ్రీదేవి అనుబంధంతో భావోద్వేగ కనెక్షన్
పాత్రల ఎంపికలో జాన్వీ అధ్యయనం
పెద్ది సినిమా సక్సెస్‌పై భవిష్యత్ ఆధారపడిందా?
Janvi kapoor | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్.. నార్త్ లో సినిమాలు చేస్తున్నా.. ఆశించిన రేంజ్ లో అక్కడ సక్సెస్ అయితే రాలేదు అనేది వాస్తవం. అందుకనే.. ఫోకస్ ఫిస్ట్ చేసింది. నార్త్ నుంచి సౌత్ పై పెట్టింది. దేవర సినిమాతో యంగ్ టైగర్ (Tiger) ఎన్టీఆర్ కు జంటగా నటించింది. తెలుగు తెరకు పరిచయం అయ్యింది. అయితే.. ఈ అమ్మడు సౌత్ లో అందులోనూ.. తెలుగులో మరింతగా రాణించేందుకు.. ప్లాన్ రెడీ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. జాన్వీ వ్యూహం ఏంటి..?

Janvi kapoor | బలమైన పునాదిగా..
బాలీవుడ్‌లో పోటీ తీవ్రంగా పెరుగుతున్న తరుణంలో, పాన్-ఇండియా గుర్తింపు సాధించడం కోసం స్టార్ హీరోయిన్లు దక్షిణాది ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ కూడా అదే దిశగా ముందుకు సాగుతుంది. అయితే.. ఆమె ఎంచుకున్న మార్గం కాస్త ప్రత్యేకం అని చెప్పాలి. దక్షిణాది ప్రేక్షకులతో త్వరగా కనెక్ట్ కావడానికి జాన్వీ (Janvi) ఒక భావోద్వేగ బంధంను ఆయుధంగా ఉపయోగిస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. అదే ఆమె తల్లి, లెజెండరీ నటి శ్రీదేవితో ఉన్న అనుబంధం. శ్రీదేవి దక్షిణాది సినిమాల్లో సాధించిన అపారమైన అభిమానాన్ని, గౌరవాన్ని జాన్వీ ఇప్పుడు తన కెరీర్‌కు ఒక బలమైన పునాదిగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది.

Janvi kapoor | అధ్యయనం చేస్తున్న జాన్వీ..
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో జాన్వీ తన తల్లి గురించి పదే పదే ప్రస్తావించడం గమనార్హం. ముఖ్యంగా తమిళ, తెలుగు ప్రేక్షకులు శ్రీదేవిని ఎంతగా ఆదరించారో, ఆమెకు దక్షిణాది సినిమాల పై ఎంత గౌరవం ఉందో ప్రత్యేకంగా చెప్పడం ద్వారా ప్రేక్షకుల్లో భావోద్వేగ అనుబంధంను పెంచే ప్రయత్నం చేస్తోంది. అంతే కాకుండా, రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో (Tamilnadu) ప్రేక్షకులకు దగ్గరయ్యే విధంగా ఉండే పాత్రల పై కూడా జాన్వీ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. శ్రీదేవి నటించిన సినిమాల్లో ఏ కథలు, ఏ పాత్రలు ఇక్కడి ప్రేక్షకులతో ఎక్కువగా కనెక్ట్ అయ్యాయన్న అంశాల పై కూడా ఆమె అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Janvi kapoor | పెద్ది సక్సెస్ అయితే..
ఇండస్ట్రీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఇది సాధారణ ప్రమోషన్ స్ట్రాటజీ కాకుండా, ఒక దీర్ఘకాలిక ప్లాన్లో భాగమై ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పటికే పాన్-ఇండియా ట్రెండ్ పెరుగుతున్న సమయంలో, దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకోవడం స్టార్‌డమ్‌కు కీలకంగా మారింది. ఈ విషయాన్ని జాన్వీ బాగా అర్థం చేసుకున్నట్టు కనిపిస్తోంది. అయితే, కేవలం ఎమోషన్ కార్డ్ మాత్రమే సరిపోదు, కంటెంట్ బలం, పాత్రల ఎంపిక కూడా అంతే ముఖ్యం అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జాన్వీ కపూర్ (Janvi Kapoor) ఈ రెండు అంశాలను బ్యాలెన్స్ చేస్తే, దక్షిణాదిలో కూడా ఆమెకు మంచి అవకాశాలు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. దేవర మూవీతో మెప్పించిన జాన్వీ ప్రస్తుతం పెద్ది సినిమాలో చరణ్ కు జంటగా నటిస్తుంది. ఈ సినిమా సక్సెస్ అయితే.. మరిన్ని అవకాశాలు జాన్వీ దక్కించుకోవడం ఖాయం. మొత్తానికి, జాన్వీ కపూర్ దక్షిణాది మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ తీసుకుంటున్న ఈ కొత్త దారిలో ఎంత వరకు సక్సెస్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. మరి.. ప్రేక్షకులు ఆమెను ఎంత వరకు ఆమోదిస్తారో చూడాలి.

