Legality of the bill | వ్యూహాత్మకం రక్షణ బంధం

Legality of the bill | వ్యూహాత్మకం రక్షణ బంధం
Legality of the bill | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ ; రక్షణ రంగంలో భారత్ తో మరింత బలోపేతమైన సంబంధాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్షిక డిఫెన్స్ బిల్లుపై సంతకం చేశారు. తద్వారా బిల్లుకు చట్టబద్దత(Legality of the bill) కల్పించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని కట్టడి చేయడానికి ఉద్దేశించిన క్వాడ్ కూటమిని పటిష్టం చేయడానికి ట్రంప్ అడుగులు వేశారు. ఈ ప్రాంతంలో చైనాతో జరుగుతున్న ఆధిపత్య పోరులో భారత్ తో కలిసి పని చేయాలని నిర్ణయించారు.
దేశ, విదేశీ బెదిరింపుల నుంచి అమెరికాను రక్షించడానికి ఈ చట్టం ఎంతో ఉప యోగపడుతుంది. దీంతో ఇండో పసిఫిక్(Pacific) తీరంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చైనా సాగిస్తున్న యత్నాలకు విఘాతం కలుగుతుంది. రక్షణ రంగంలో భారత్ తో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుక ని వెళ్ళేందుకు ఇది తోడ్పడుతుంది.
సంయుక్త సైనిక విన్యాసాలు
రక్షణ రంగంలో ఇరుదేశాల మధ్య ఇప్పటికే వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. క్వాడ్ ద్వారా, ఇండో పసిఫిక్ బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. ఇటీవల భారత్ లో రష్యా అధ్యక్షుడు(President of Russia) వ్లాదిమిర్ పుతిన్ పర్యటన గురించి ఈ సందర్భంగా పెద్దగా ప్రస్తావించక పోవడం గమనార్హం. భారత్ తో సంయుక్త సైనిక విన్యాసాలు జరపడానికి రక్షణ, విపత్
