గురుకుల విద్యార్థిలతో పోలీసుల ఇష్టాగోష్టి..

చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో చెన్నూర్ సీఐ సూచన మేరకు చెన్నూర్ టౌన్ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్స్ సాహెరా, మనీషా లు పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో సమావేశమై వారితో ఇష్టాగోష్టిగా ముచ్చటించి విద్యార్థినులు మంచిగా చదువుతున్నారా, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకోన్నారు.
ఇకపై వారానికి రెండు సార్లు మహిళా పోలీస్ సిబ్బంది పాఠశాలను సందర్శించి వారితో మమేకం అవుతూ వారికి సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యపర్చటం జరుగుతుందన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రత కు సంబంధించి గురువారం పాఠశాలలో డ్రాయింగ్ కాంపిటిషన్ నిర్వహించిన పోలీసులు పాల్గొన్న విద్యార్థినులకు పెన్స్ బహుకరించి విద్యార్థినులందరికి బిస్కెట్ ప్యాకెట్స్ మహిళా కానిస్టేబుల్స్ అందించారు.
