Kuntala | ఏదైనా సాధించాలంటే..

Kuntala | ఏదైనా సాధించాలంటే..

Kuntala, కుంటాల, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగ పురస్కరించుకొని కుంటాల మండలంలోని లింబ కె గ్రామంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు గురువారం ముగిశాయి. దీంతో గత రెండు రోజుల పాటు క్రికెట్ పోటీలు కొనసాగా పోటీల్లో ఆఖరి రోజు గెలుపొందిన జట్లకు బహుమతులతో పాటు నగదు బహుమతులను అందజేశారు.

అనంతరం స్థానిక సర్పంచ్ సుంకరి గీతా మహేందర్ లు మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని గ్రామంలో ప్రతి ఏటా ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. క్రికెట్ పోటీలతో పాటు ముగ్గుల పోటీలు తదితర పోటీల నిర్వహించడం జరిగిందని తెలిపారు. క్రీడాలతో యువతకు మానసిక ఉల్లాసం లభిస్తుందని పేర్కొన్నారు. క్రీడాల పట్ల యువకులు ఆసక్తి పెంచుకోవాలన్నారు.

పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. ఈ క్రీడలు ఎంతో విలువైనవి అని, క్రీడలతో పాటు చదువు పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని.. చదువు ఎంతో గొప్పదని చదువుతూనే ఏదైనా సాధించవచ్చు అని పేర్కొన్నారు. ఏదైనా సాధించాలంటే.. చదువు ఎంతో అవసరమని, విద్యార్థుల తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలంటే.. చదువు అవసరమని తెలిపారు.

అనంతరం క్రికెట్ పోటీలతో పాటు గెలుపొందిన జట్లకు బహుమతులను ప్రదానం చేసి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సత్తయ్య, మాజీ ఆత్మ చైర్మన్ అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆనంద్ రావు, పటేల్ సొసైటీ మాజీ డైరెక్టర్ గజ్జరం, వీడిసి అధ్యక్షులు వెంకట్ రెడ్డి, స్థానిక నాయకులు శ్రీకర్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply