ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి చంద్రన్న నివాళి

ఆంధ్రప్రభ, ఇంద్రవెల్లి : అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని అమరవీరుల స్తూపాన్ని తాను మొదటిసారి సందర్శించినట్లు మాజీ సిపిఐ (మావోయిస్టు) దళ సభ్యుడు చంద్రన్న తెలిపారు. పోరాటాల ద్వారానే ప్రజల సమస్యలు సాధ్యమవుతాయని ఆయన పేర్కొన్నారు.

సోమవారం మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎన్టీ రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాలంలో 1986లో ఈ స్తూపాన్ని డైనమైట్‌లతో కూల్చివేశారని గుర్తు చేశారు. అనంతరం ప్రభుత్వం తలవంచి మళ్లీ అదే స్తూపాన్ని పునర్నిర్మించినట్లు తెలిపారు.

ప్రస్తుతం తాను ప్రజల్లోనే ఉంటూ చట్టపరంగా ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తున్నానని చంద్రన్న చెప్పారు. ఏ ప్రభుత్వం అయినా ప్రజల సమస్యలను పరిష్కరిస్తే పోరాటాలకు తావు ఉండదని అభిప్రాయపడ్డారు.

అదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే టైగర్ జోన్ 41 జీవో రద్దు కోసం పోరాటం తప్పదని హెచ్చరించారు. 1981లో జరిగిన ఇంద్రవెల్లి ఘటనపై కూడా ఆయన ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, మాజీ మావోయిస్టు దళ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply