ఘనంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు..
కడెం, ఆంధ్రప్రభ: మండల కేంద్రమైన కడెంలో సోమవారం బీజేపీ మండల అధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జాతీయవాద సిద్ధాంతకర్త, మాజీ కేంద్రమంత్రి, మేధావి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ హాజరై శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రితేష్ రాథోడ్ మాట్లాడుతూ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలు, ఆయన సిద్ధాంతాలు ప్రేరణాత్మకమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు పి. శ్రీరామ్, రాపర్తి శ్రీనివాస్, బీజేపీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ మోహన్ నాయక్, మండల నాయకులు ధర్మపురి తిరుమలయ్య, ములికి కృష్ణ, ఎన్. ప్రసాద్, గట్ల, నల్లగొండ పాలకుర్తి నగేష్, కర్ణాటక భీమన్న, జి. ప్రసాద్, రాపల్లి కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
