Bheemgal కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
Bheemgal కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
- పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా: భీమ్‌గల్‌లో లబ్ధిదారులకు చెక్కులు అందజేత
భీమ్‌గల్ రూరల్ (Bheemgal), ఆంధ్రప్రభ:
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండలం ముచ్కూర్ గ్రామంలో బుధవారం కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ప్రభుత్వం ద్వారా మంజూరైన నరబోయిన శ్రీవణ్య, కొరడి శ్రీవర్షకు సంబంధించిన చెక్కులను స్థానిక సర్పంచ్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గట్టు మురారి, ఇతర నాయకులు లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం వరం లాంటిదని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక భరోసా కల్పిస్తున్న కల్యాణ లక్ష్మి పథకం అభినందనీయమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ మల్లేష్, గ్రామ పంచాయతీ సెక్రటరీ సంజయ్, గ్రామ పాలన అధికారి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బద్ది అవినాష్, కోరాడి లింబాద్రి, కోరాడి రాజు, ఓబులురెడ్డి, డిష్ అశోక్, కిష్టాగౌడ్, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
