iplcricketmatch | 165 ఆల్ అవుట్

iplcricketmatch | 165 ఆల్ అవుట్

iplcricketmatch | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL 2026)లో భాగంగా ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్, ప్రత్యర్థి బౌలర్ల ధాటికి 165 పరుగుల వద్దే ఇన్నింగ్స్ ముగించింది.

ఓపెనర్లు ధాటిగా ఆడే ప్రయత్నం చేసినప్పటికీ, క్రమంగా వికెట్లు కోల్పోవడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. ట్రావిస్ హెడ్ (61), ఇషాన్ కిషన్ (42)లు మినహా మిగిలిన ఆటగాళ్లెవరూ ఆకట్టుకోలేకపోయారు. మిడిల్ ఆర్డర్ వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టడంతో ఎస్ఆర్హెచ్ స్కోరు బోర్డు నెమ్మదించింది.

కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో చెలరేగగా, సునీల్ నరైన్ , కార్తీక్ త్యాగి తలో రెండు వికెట్లు తీసి హైదరాబాద్‌ను దెబ్బతీశారు. నిర్ణీత 19 ఓవర్లలోనే 165 పరుగుల వద్ద హైదరాబాద్ జట్టు కుప్పకూలింది. ప్రస్తుతం కేకేఆర్ ముందు 166 పరుగుల లక్ష్యం ఉంది. ఉప్పల్ స్టేడియంలో ఈ స్వల్ప లక్ష్యాన్ని హైదరాబాద్ బౌలర్లు ఎలా కాపాడుకుంటారో వేచి చూడాలి.