సభా ప్రాంగణాన్ని, హెలిప్యాడ్ స్థలాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్..
సభా ప్రాంగణాన్ని, హెలిప్యాడ్ స్థలాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్..
ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : ఈనెల 9న ఎ.కొండూరు మండలం మాధవరం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, స్థానిక అధికారులతో కలిసి, సభా ప్రాంగణాన్ని, హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ… రైతులకు రాజముద్రతో ఇవ్వనున్న పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా 9వ తేదీన పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భాగంగా ఎ.కొండూరు మండలం తూర్పు మాధవరం గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి దాదాపు 702 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారని కలెక్టర్ తెలిపారు.
అధికారులందరూ అప్రమత్తమై సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఇలక్కియా, ఆర్డీవో ఏ.కుమార్, సీఐ గిరిబాబు, ఎస్ ఐ,గంధం. మహాలక్ష్మనుడు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
