Targets-200-Women : ప్రతి మ‌హిళా వ్యాపారే Andhra Prabha Top News

Targets-200-Women : ప్రతి మ‌హిళా వ్యాపారే Andhra Prabha Top News

  • ప్ర‌తి జిల్లాలో 200 మంది టార్గెట్​
  • ఇది ఏపీ సీఎం సీబీఎన్​ విజన్​
  • సెర్ప్​ తో మ‌హిళ‌ల ఆర్థిక సాధికార‌తే ల‌క్ష్యం
  • అర్హులైన ప్రతి డ్వాక్రా మహిళకు జీవనోపాధి
  • ఉత్త‌రాంధ్ర జిల్లాల జీవ‌నోపాధి స‌మీక్ష‌లో మంత్రి కొండ‌ప‌ల్లి

(ఆంధ్రప్రభ , విశాఖ‌ప‌ట్నం బ్యూరో ),

Targets-200-Women

Targets-200-Women : ఒక కుటుంబం ఒక పారిశ్రామిక వేత్త అనేది.. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు విజ‌న్‌కు అనుగుణంగా ప్రతి స్వయం సహాయక సంఘాన్ని (SHG) ఒక పారిశ్రామిక వేత్త కుటుంబంగా మార్చ‌డ‌మే కూటమి ప్ర‌భుత్వ ల‌క్ష్యం అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం మంత్రి పెందుర్తిలోని టిటిడిసి (TTDC) ప్రాంగణంలో ఉత్త‌రాంధ్ర‌లోని ఆరు జిల్లాల డీఆర్‌డీఏ (DRDA) ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్లు, డీపీఎంలు, జిల్లా స‌మాఖ్య స‌భ్యుల‌తో నిర్వ‌హించిన‌ జీవనోపాధి కార్యక్రమాల సమీక్షలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ సెర్ప్ (SERP) తో స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌లో ఉన్న మ‌హిళ‌ల ఆర్థిక సాధికార‌తే త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 ల‌క్ష‌ల మంది సంఘం మ‌హిళ‌లు, 4584 మంది నిపుణులు, 27 వేల మంది వీఓఏలు, 1.5 ల‌క్ష‌ల మంది ఈనారీల‌తో సెర్ఫ్ చాలా బ‌లంగా ఉంద‌ని… దీని ద్వారా ఉపాధి క‌ల్ప‌న మ‌రింత విస్తృతం చేస్తామ‌ని మంత్రి తెలిపారు. మోడ్రన్ లాండ్రీ యూనిట్లు, హెయిర్ సెలూన్లు, కార్పెంట్రీ, బొటిక్ మేనేజ్‌మెంట్ రంగాల్లో శిక్ష‌ణ కోసం పైలెట్ ప్రాజెక్టులు చేప‌డ‌తామ‌ని వెల్ల‌డించారు. సంఘం మహిళలకు సాంకేతిక సాయం, మార్కెట్ సౌకర్యాలు కల్పించ‌డంతో పాటు పీఎం సూర్య ఘ‌ర్ యోజ‌న ద్వారా సోలార్ ప‌వ‌ర్ యూనిట్ల ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి కల్పనలో బ్యాంకుల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్న మంత్రి, అర్హులైన మహిళలకు రుణ సదుపాయాలు కల్పించి, 2026 జూన్ నెలాఖరు నాటికి ఒక్కొక్క జిల్లాలో కనీసం 200 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOs) సమగ్ర బిజినెస్ ప్లాన్ రూపొందించుకోవాలని, కస్టమ్ హైరింగ్ సెంటర్ల (CHCs) ద్వారా రైతులకు యంత్ర పరికరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. పాడి రైతుల కోసం నాణ్యమైన పశుగ్రాసం, సైలేజ్ మేకింగ్ యూనిట్లు మరియు పాలు, పాల ఉత్పత్తుల బ్రాండింగ్, మార్కెటింగ్‌పై శిక్షణ ఇస్తామన్నారు. అలాగే పీఎంజెజెబివై (PMJJBY), పీఎంఎస్‌బివై (PMSBY) పథకాల కింద అర్హులైన మహిళలందరికీ బీమా క‌ల్పించాల‌ని సూచించారు.

Targets-200-Women : 5 ల‌క్ష‌ల మంది మ‌హిళా వ్యాపార‌వేత్త‌లే ల‌క్ష్యం

Targets-200-Women

గ‌తంలో డిజిట‌లైజేష‌న్ ఇబ్బందులు ఉండేవ‌ని… ఇప్పుడు డ్వాక్రా మ‌హిళ‌ల‌కు అందుబాటులో ఉండేలా డిజిట‌లైజేష‌న్ తీసుకువ‌చ్చామ‌ని.. గ్రామీణ మ‌హిళ‌ల పేద‌రిక నిర్మూల‌న కోసం ముఖ్య‌మంత్రి గారు ఎన్నో ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతున్నార‌ని మంత్రి తెలిపారు. త్వ‌ర‌లోనే మ‌న డ‌బ్బులు… మ‌న లెక్క‌లు అనే ఫోన్ యాప్ డ్వాక్రా మ‌హిళల కోసం తీసుకు వ‌స్తున్నామ‌ని.. దీని ద్వారా 85 ల‌క్ష‌ల మంది స‌భ్యులు డ్వాక్రాలో చేసుకున్న అప్పులు, పొదుపు గురించి తెలుసుకోవ‌చ్చ‌న్నారు. అలాగే 5 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌ను వ్యాపార‌స్తులుగా చేయాల‌న్న సంక‌ల్పంతో ముఖ్య‌మంత్రి ఉన్నార‌ని.. అందుకు అనుగుణంగానే మ‌న ప్ర‌ణాళిక‌లు ఉండాల‌ని మంత్రి అధికారుల‌కు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ఆయా జిల్లాల జిల్లా సమాఖ్య (జిల్లా సమాఖ్య) పాలకవర్గ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు. అలాగే గాటోస్ కేఫే, నేటివ్ అరకు కేఫే తదితర జీవనోపాధి భాగస్వామ్య సంస్థల ప్రతినిధులతో కూడా ముఖాముఖి సమావేశమై వారి అనుభవాలు, వ్యాపార విస్తరణ అవకాశాలపై చర్చించారు. అలాగే రాష్ట్రంలోని పీడీ, డీపీఎం, ఏపీఎంల‌కు 912 ల్యాప్‌ట్యాప్‌లు అంద‌జేసే కార్య‌క్ర‌మానికి మంత్రి శ్రీకారం చుట్టారు.

Targets-200-Women

సెర్ప్ సీఈఓ కరుణ వాకాటి మాట్లాడుతూ, ప్రతి జిల్లాలో జీవనోపాధి అవకాశాలను స్థానిక వనరులకు అనుగుణంగా విస్తరించాలని, మహిళలకు రుణాలు, మార్కెటింగ్, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యాపార నిర్వహణలో పూర్తి స్థాయి సహకారం అందించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో లైవ్లీహుడ్స్ డైరెక్టర్ శివశంకర్ ప్రసాద్, హెచ్ఆర్ డైరెక్టర్ కల్యాణ్ చక్రవర్తి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ALSO READ : Vijayawada-Railway : హైస్పీడ్​ లో అభివృద్ధి Andhra Peadesh Top Story

Leave a Reply