ipl punjab vs mubai |పంజాబ్ జ‌ట్టుకు కీల‌కం

ipl punjab vs mubai |పంజాబ్ జ‌ట్టుకు కీల‌కం

ఐపీఎల్‌లో పంజాబ్‌, ముంబై ఢీ
పంజాబ్‌లోని ధర్మశాల వేదికగా..
రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
ముంబైకి నామ‌మాత్ర‌పు మ్యాచ్‌
ఇప్ప‌టికే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్ర‌మ‌ణ‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026లో భాగంగా నేడు మ‌రో ఆస‌క్తిక‌ర పోరు జరగనుంది. ధర్మశాల వేదికగా రాత్రి 7.30 గంటలకు పంజాబ్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ ఢీకొంటుంది. ముంబై జ‌ట్టు వ‌రుస ఓట‌ముల‌తో ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. అయితే ఈ మ్యాచ్ ముంబైకి నామ‌మాత్ర‌మ‌పు మ్యాచ్ అని చెప్ప‌వ‌చ్చు. కానీ పంజాబ్ కింగ్స్ కు మాత్రం కీల‌క‌మైన మ్యాచ్ అని చెప్ప‌వ‌చ్చు. ఈ జ‌ట్టు ప్లే ఆఫ్ రేసులో ఉంది. కాబ‌ట్టి ఈ మ్యాచ్ పంజాబ్‌కు త‌ప్ప‌క గెల‌వాల్సిందే. గెలిస్తేనే టేబుల్‌లో టాప్ 4లో ఉంటుంది. లేదంటే క్లిష్ట ప‌రిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ కీలకం.

ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది, అయినప్పటికీ పరువు కోసం ఆడనుంది. ముంబయి ఇండియన్స్ పదకొండు మ్యాచ్ లుఆడి మూడింటిలో గెలిచి ఎనిమిది మ్యాచ్ లలో ఓడింది. కేవలం ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. టోర్నీ ఆరంభంలో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్ త‌రువాత వ‌రుస ఓట‌ములు ఎదుర్కొంది. ప్రస్తుతం టేబుల్‌లో 4వ స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ మాత్రం పదకొండు మ్యాచ్ లు ఆడి ఆరు మ్యాచ్ లలో గెలిచి నాలుగు మ్యాచ్ లలో ఓడింది. ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిల‌వాలంటే పంజాబ్ కష్టపడాల్సి ఉంటుంది.

ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు 35 సార్లు తలపడగా, పంజాబ్ 18 సార్లు, ముంబై 17 సార్లు విజయం సాధించాయి.

ప్రస్తుత ఫామ్ ప్రకారం కూడా పంజాబ్ కింగ్స్ కు ఎక్కువగా అడ్వాంటేజ్ ఉండనుంది. దానికి తోడు ధర్మశాల పంజాబ్ హోమ్ గ్రౌండ్. ఈ లెక్కన ముంబై ఇండియన్స్ కంటే పంజాబ్ కింగ్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.