Suicide Attempt Family Tragedy | ముగ్గురు ఆత్మహత్యాయత్నం.. తల్లి, కుమార్తె మృతి
Suicide Attempt Family Tragedy | ముగ్గురు ఆత్మహత్యాయత్నం.. తల్లి, కుమార్తె మృతి
Suicide Attempt Family Tragedy | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లి, కుమార్తె చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనలో కుటుంబ పెద్ద మహేష్ కూడా పురుగుల మందు సేవించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబం ఈ దారుణ నిర్ణయం ఎందుకు తీసుకుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆత్మహత్యాయత్నానికి దారితీసిన కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
