చేపల వేటకు కరెంట్ వాడి.. వ్యక్తి మృతి
చేపల వేటకు కరెంట్ వాడి.. వ్యక్తి మృతి
బీర్‌పూర్, ఆంధ్రప్రభ:
బీర్‌పూర్ మండలంలోని చిత్రవేణిగూడెం గ్రామానికి చెందిన చిక్రం సాగర్ అనే వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతిచెందాడు. చేపల వేటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం, శనివారం మధ్యాహ్నం చిక్రం సాగర్‌తో పాటు అదే గ్రామానికి చెందిన మరో నలుగురు వ్యక్తులు కమ్మునూర్ శివారులోని గోదావరి నదికి చేపల వేటకు వెళ్లారు. సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్ నుంచి విద్యుత్ తీగలు వాడి చేపలు పట్టే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది.
నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విద్యుత్ సరఫరా ఉన్న తీగపై జారి పడిన చిక్రం సాగర్ విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందినట్లు మృతుని భార్య ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ దామెర సుధాకర్, బీర్‌పూర్ ఎస్‌ఐ సబ్బని రాజు తెలిపారు. నేరస్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
