ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు..

మునుగోడు, ఆంధ్రప్రభ : 2025-26 సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపికకు శనివారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో గంగుల యుగంధర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు మండల స్పెషల్ ఆఫీసర్,బ్యాంకు మేనేజర్లు,ఎస్సీ కార్పొరేషన్,డీఆర్‌డీఏ, వెటర్నరీ అధికారులతో కూడిన మండల కమిటీ సమక్షంలో ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు.దరఖాస్తుదారులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.
