ప్రైవేటు బస్సు దగ్ధం
ప్రైవేటు బస్సు దగ్ధం
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వెంటనే మంటలు గుర్తించిన డ్రైవర్, క్లీనర్ బస్సు ప్రయాణికులను క్రిందికి దింపారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడినప్పటికీ ప్రయాణికుల సామాన్లు మాత్రం పూర్తిగా కాలిపోయాయి. షార్ట్ సర్య్కూట్ వలనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
