బెజ్జంకి కరుణాకర శాస్త్రికి స్ఫూర్తి నంది అవార్డు ప్రధానం
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణానికి చెందిన బెజ్జంకి కరుణాకర శాస్త్రికి స్ఫూర్తి నంది అవార్డును ప్రధానం చేశారు. తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో పరకాల పట్టణానికి చెందిన బెజ్జంకి కరుణాకర శాస్త్రికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కారాల ప్రధాన ఉత్సవ కార్యక్రమం వరంగల్ టీఎన్జీవో భవనములో శనివారం రోజు స్ఫూర్తి నంది అవార్డు ను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా పరకాల పట్టణ ప్రముఖులు, సన్నిహితులు వివిధ వర్గాలకు చెందినవారు కరుణాకర శాస్త్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. కరుణాకర శాస్త్రి మాట్లాడుతూ అవార్డు అందుకోవడం చాలా సంతోషకరంగా ఉందని, అవార్డును ప్రధానం చేసిన నిర్వాహకులకు, అభినందించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
