అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని లబ్ధిదారులు సకాలంలో ఇండ్లునిర్మించుకోవాలని పగిడి మారిసర్పంచ్ జాఫర్, గృహ నిర్మాణశాఖఏఈ ప్రేమఅన్నారు. గురువారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పగిడిమరి లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు సకాలంలో ఇల్లు నిర్మించుకుంటే ప్రభుత్వం దశలవారీగా రూ. 5 లక్షలుబిల్లుచెల్లిస్తుందనిఅన్నారు. మంత్రి సహకారంతో గ్రామానికి 29 ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు తెలిపారు.
లబ్ధిదారులుఇళ్ల నిర్మాణపనులుత్వరగా పూర్తిచేస్తే గ్రామంలో నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయిస్తామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో ప్రభుత్వ పేద ప్రజల కలలు సహకారం చేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధికి సహకరించాలని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతంగా చేపట్టి సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనిఅన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాఘప్ప, పంచాయతీ కార్యదర్శి ఆసిఫా, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
