సొంతింటి కల సాకారం కాంగ్రెస్ తోనే నెరవేరుతుంది

సొంతింటి కల సాకారం కాంగ్రెస్ తోనే నెరవేరుతుంది
- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జినుకల రమేష్
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : పేదోడి సొంతింటి కల సాకారం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్ అన్నారు.గురువారం మండలంలోని పకీరతండా గ్రామానికి చెందిన నేతావత్ సుగుణకు మంజూరై నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇల్లు నూతన గృహాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గుగులోత్ బాబురావు,మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు దసృ నాయక్,వివిధ గ్రామాల సర్పంచులు పుప్పాల రవీందర్,పెదమాముల యాకయ్య,సోషల్ మీడియా కన్వీనర్ చిర్ర సతీష్ గౌడ్,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
