ప్రజా ప్రభుత్వంలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి అడ్లూరి
గొల్లపల్లి ఆంధ్ర ప్రభ : ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గోవిందుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు.
అనంతరం గ్రామంలో ఎస్సీ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని మంత్రి దృష్టికి గ్రామస్తులు తీసుకువచ్చారు.
డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పేద ప్రజల స్వంతింటి కల నెరవేర్చడానికి కృషి చేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.
