Javelin throw – Ind vs. Pak | నీరజ్ – అర్షద్ నదీమ్ రీమ్యాచ్!
- ఆగస్ట్ 16న సిలేసియా డైమండ్ లీగ్, పోలాండ్
- ఒలింపిక్స్‌కు ప్రతీకారం?
భారత అథ్లెట్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) మరోసారి తన చిరకాల ప్రత్యర్థి, పాకిస్తాన్ జావెలిన్ స్టార్ అర్షద్ నదీమ్(Arshad Nadeem)తో ఢీకొనబోతున్నాడు. ఆగస్టు 16 నుంచి పోలాండ్‌లోని సిలేసియా(Silesia, Poland)లో జరగనున్న డైమండ్ లీగ్ (Diamond League) మీటింగ్లో వీరిద్దరు మరోసారి తలపడనున్నారు. ఇది కేవలం ఒక పోటీ మాత్రమే కాదు, జావెలిన్ ప్రపంచంలోనే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రీమ్యాచ్‌ల(Rematche)లో ఒకటి.
పారిస్ ఒలింపిక్స్ ప్రతీకారం – ఒక పునరావృతం?
గత సంవత్సరం పారిస్ ఒలింపిక్స్(Paris Olympics)లో అర్షద్ నదీమ్ 92.97 మీటర్ల అద్భుతమైన త్రోతో బంగారు పతకం (Gold medal) గెలుచుకుని నీరజ్ చోప్రాను ఓడించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్‌లో నీరజ్ 89.45 మీటర్లతో రజత పతకం(silver medal)తో సరిపెట్టుకున్నాడు. అప్పటి నుంచి, ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య మరోసారి హోరాహోరీ పోరు చూడాలని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. సిలేసియాలో జరిగే ఈ మ్యాచ్, పారిస్ ఒలింపిక్స్‌లో జరిగిన మ్యాచ్‌కు నీరజ్ ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు.
ఈ సీజన్ అదరగొడుతున్న నీరజ్..
ఈ సీజన్‌లో నీరజ్ చోప్రా అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శిస్తున్నాడు. మే 16న దోహా డైమండ్ లీగ్(Doha Diamond League)లో 90.23 మీటర్లు విసిరి తన 90 మీటర్ల మార్కును అధిగమించాలనే కలను నిజం చేసుకున్నాడు. ఈ ప్రదర్శన అతనికి కెరీర్‌లో అత్యుత్తమ త్రో(Career best throw)గా నిలిచింది. ఈ సంవత్సరం అతను నాలుగు డైమండ్ లీగ్ ఈవెంట్‌లు, రెండు ఇతర ముఖ్యమైన అంతర్జాతీయ ఈవెంట్‌లలో చోర్జోవ్ (Chorzow), ఆస్ట్రావా, (Ostrava) పాల్గొని నిలకడైన ప్రదర్శన కనబరిచాడు.
ఇటీవలే బెంగళూరులో జరిగిన NC క్లాసిక్ లో(Neeraj Chopra Classic 2025)నూ గోల్డ్ సాధించి తన ఆధిపత్యాన్ని చాటాడు. ప్రస్తుతం, నీరజ్ జావెలిన్ త్రో దిగ్గజం, మూడుసార్లు ఒలింపిక్ ఛాంపియన్ అయిన జాన్ జెలెజ్నీ (John Zelezny) ఆధ్వర్యంలో చెక్ రిపబ్లిక్‌లో శిక్షణ (Training in the Czech Republic) పొందుతున్నాడు. జెలెజ్నీ మార్గదర్శకత్వం నీరజ్ టెక్నిక్‌ను మరింత మెరుగుపరచి, భవిష్యత్ ఛాంపియన్‌షిప్‌లలో అతని ప్రదర్శనను పెంచుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, వచ్చే ఏడాది జరిగే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్(Los Angeles Olympics)కు ముందు ఈ డైమండ్ లీగ్ ఈవెంట్‌లు నీరజ్‌కు కీలకమైన సన్నాహాలుగా ఉపయోగపడతాయి.
తిరిగి ట్రాక్‌లోకి అర్షద్ నదీమ్..
మరోవైపు, అర్షద్ నదీమ్ ఈ సీజన్‌లో యూరోపియన్ సర్క్యూట్(European circuit)లో పెద్దగా కనిపించలేదు. పారిస్ ఒలింపిక్స్ తర్వాత అతను మోచేతి గాయం(Elbow injury)తో పోరాడుతున్నాడు. ఈ సంవత్సరం అతని ఏకైక ప్రధాన అంతర్జాతీయ పోటీ ఏప్రిల్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్ (Asian Championship). అక్కడ అతను 86.40 మీటర్లు విసిరి స్వర్ణం గెలుచుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్ తర్వాత అతని మొదటి ప్రధాన పోటీ ఇదే.
సిలేసియా డైమండ్ లీగ్ అతని ఫామ్‌ను తిరిగి పొందడానికి, వచ్చే ప్రధాన ఈవెంట్‌ల కోసం తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఒక కీలకమైన అవకాశంగా నిలుస్తుంది. నదీమ్ తన గాయాల నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నాడని, తిరిగి తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలడని అభిమానులు ఆశిస్తున్నారు.
ఆసక్తికరంగా దాయాదుల పోరు..
డైమండ్ లీగ్ నిర్వాహకులు ఈ మ్యాచ్‌ను “పోలిష్ అభిమానులు ఎదురుచూస్తున్న ఇండియా-పాక్ ఘర్షణ”గా (The India-Pak clash Polish fans have been waiting for) అభివర్ణించారు. భారత్-పాక్ మధ్య క్రికెట్‌తో పాటు ట్రాక్ అండ్ ఫీల్డ్(Track and Field)లో కూడా బలమైన క్రీడా పోటీ చరిత్ర ఉంది.
నీరజ్ – నదీమ్‌ల మధ్య ఈ పోటీ కేవలం వ్యక్తిగత పతకం కోసం మాత్రమే కాకుండా, రెండు దేశాల క్రీడాభిమానులకు భావోద్వేగ ప్రాధాన్యతను కలిగి ఉంది. సిలేసియాలో జరగనున్న ఈ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది క్రీడాభిమానులను ఆకర్షించనుంది. ఇది జావెలిన్ త్రోకు, అథ్లెటిక్స్‌కు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.
